అపరిచిత వ్యక్తులతో పరిచయం మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో ఓ యువకుడి ప్రాణం తీసింది. మోహన్ రావు కాలనీకి చెందిన అశోక్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో పరిచయమైన గుర్తు తెలియని మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆమె మాట్లాడకపోవడం, వాట్సాప్‌లో నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టడంతో మనస్తాపం చెందాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మహిళా మాట్లాడకపోవడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయం చూసి సెల్ఫీ వీడియో తీస్తూ ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
అశోక్ ఫోన్‌ను పరిశీలించగా.. సోషల్ మీడియాలో ఓ మహిళతో సంభాషణలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరగడంతో ఆమె చాట్ చేయడం ఆపేసినట్టుగా అర్థమవుతోంది. ఆత్మహత్య చేసుకునేందు వీడియోలో కన్నయ్య అని సంబోధించాడు. తాను తన నానమ్మ దగ్గరకు వెళ్లిపోతున్నా హ్యాపీగా ఉండటూ అంటూ చెప్పుకుపోయాడు.