హైదరాబాద్ బాలానగర్ ఫ్లై ఓవర్ యాక్సిడెంట్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకొచ్చింది. బైక్ పై అతివేగంగా వెళ్తూ సేఫ్టీ డివైడర్ ను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది.
ప్రకాశం జిల్లా కొనిదెన గ్రామానికి చెందిన అశోక్… లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కేపీహెచ్బీ లోని సోదరుడి ఇంటికి వచ్చాడు. ఈనెల 20న లైసెన్స్ తీసుకునేందుకు తిరుమలగిరిలోని ఆర్టీఏ కార్యాలయానికి బైక్ పై వెళ్తుండగా బాలానగర్ ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ అయింది.
అతి వేగంగా వెళ్తూ అదుపుతప్పి.. సేఫ్టీ డివైడర్ ను ఢీ కొట్టాడు అశోక్. వెంటనే అదేమార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు గమనించి… 108లో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.