వికారాబాద్ జిల్లా తాండూరులో ఎఫ్ఐఆర్ సినిమాపై వివాదం నెలకొంది. ఒక మత గ్రంథానికి సంబంధించిన వ్యాఖ్యలు సినిమా పోస్టర్ పై ముద్రించడం తో వివాదం నెలకొంది.
దీనితో తాండూర్ శాంతి మహల్ థియేటర్ లో శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్ఐఆర్ సినిమాను అడ్డుకున్నారు మైనార్టీ యువకులు.
థియేటర్ ముందు ఉంచిన సినిమా పోస్టర్లను చించివేశారు. సినిమా డైరెక్టర్ పై, సినిమా థియేటర్ యాజమాన్యం పై కేసు నమోదు చేయాలంటూ డిఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.
Advertisements
విష్ణు విశాల్ హీరోగా వస్తున్న ఈ సినిమాను స్వయంగా విష్ణు విశాల్ స్టూడియోస్ పతాకంపై ఆయనే నిర్మించారు. ఇక తెలుగులో అభిషేక్ పిక్చర్స్ వారు విదుదల చేస్తున్నారు.