తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో నియామకాల అవకతవకలపై ప్రగతి భవన్ ముట్టడించాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లకుండా జిల్లా కేంద్రమైన జనగాం లోని పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసారు.
శనవారం తెల్లవారు జాము నుంచే పోలీసులు ముందుస్తు అరెస్ట్ లు చేపట్టారు. ముందుగా యువజన కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ అధ్యక్షులు క్రాంతి కుమార్, ఎస్టీ సెల్ నర్మెట్ట మండల అధ్యక్షులు రామకృష్ణ లను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.
వారితో పాటు నర్మెట్ట టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజ్ఙపురం శ్రీధర్, సోషల్ మీడియా కన్వీనర్ బుర్ర రాజులను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ పరీక్షలో తప్పులకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. దీంతో పలువురు యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.