టీఆర్ఎస్ పాలనపై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల జాడ లేకపోవడంతో తీవ్ర అసహనంలో ఉన్నారు. కొందరు వేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. ఎంతమంది నిరుద్యోగులు చనిపోతున్నా ప్రభుత్వం స్పందిచకపోవడంపై ప్రతిపక్షాలు నిరసన బాట పడుతున్నాయి. కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఏదైనా ప్రాంతానికి వెళ్తే.. ఈమధ్య నిరసన సెగ కామన్ అయిపోయింది. టీఆర్ఎస్ నేతల వాహనాలు ఎక్కడ కనిపించినా ప్రతిపక్ష పార్టీల నేతలు, నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.
పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమం జరిగింది. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నించారు.
Advertisements
పోలీసులు వెంటనే అప్రమత్తమై నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెమినీ గౌడ్ గణేష్ సహా పలువురు పాల్గొన్నారు. అరెస్ట్ చేసిన వారిని ధర్మారం పీఎస్ కు తరలించారు.