కొడంగల్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే ప్రారంభించాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అంబేద్కర్ కూడలి వరకు మానవహారం నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తహసిల్దార్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.
వెనుకబడిన తరగతుల ప్రజలు ఉన్న కోడంగల్ నియోజకవర్గంలో నేటికీ డిగ్రీ కళాశాలను ప్రారంభించకపోవడం విచారకరమన్నారు. అలాగే కోస్గి.. కొడంగల్ పట్టణ కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు.