ప్రమాదం అని తెలిసినా సరదా కోసం యువత చేస్తోన్న పనులు ప్రాణాలపైకి తెస్తున్నాయి. ఒక్క క్షణం ఆనందం కోసం జీవితాన్నే ఫణంగా పెట్టేస్తున్నారు. తమకు తెలియకుండానే తమ జీవితం అర్ధాంతరంగా ముగుస్తుందని గమనించలేకపోతున్నారు.
తాజాగా నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో సెల్ఫీ తీసుకోవాలనే ఆలోచన యువకుడికి యమపాశంల మారింది. స్థానికంగా ఉన్న ఓ గుడి ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కేబిన్ గ్రిల్ లో కూర్చుని అది తిరుగుతున్న సమయంలో సెల్ఫీ తీసుకోటానికి ప్రయత్నించాడు ఓ యువకుడు. కేబిన్ గ్రిల్ అధికవేగంగా తిరుగుతుండటంతో సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తి అదుపుతప్పి పక్కకు పడిపోవటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువకుడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.