కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ లేడీస్ హాస్టల్‌లోని గదిలో యువకుడు పట్టుబడటం కలకలం రేపుతోంది. విద్యార్థినుల హాస్టల్ లోకి ప్రవేశించిన ఆ యువకుడు రోజంతా అక్కడే ఉన్నాడు. హాస్టల్ వెనుక నుంచి వచ్చి కిటికి గుండా వచ్చి యువకుడు ప్రవేశించినట్టు సమాచారం.
గదిలో కి యువకుడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. తర్వాత మిగిలిన నలుగురు విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. గదిలో ఉన్న విద్యార్థి రోజంతా అక్కడే ఉన్నాడు. గదిలో ప్రవేశించిన యువకుడితో పాటు యువకుడు రావడానికి సహాయం చేసిన మరో ఆరుగురు విద్యార్థులను ట్రిపుల్ ఐటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. అమ్మాయిలు ఉండాల్సిన హాస్టల్‌లో యువకుడు ప్రవేశించడంతో క్యాంపస్ లో కలకలం రేపుతోంది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణం అని అంటున్నారు.