కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని అందరితో పంచుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన… యూట్యూబ్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరోనా సమయం .. తనకెంతో ఉపయోగపడిందని చెప్పారు.
కరోనా సమయాన్ని తాను ఎంతో చక్కగా వినియోగించుకున్నానని చెప్పిన నితిన్ గడ్కరి.. ఆ సమయంలో తాను ఇంట్లో వంట చేయడం ప్రారంభించానని, అలాగే ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌ల్లో ప్రసంగాలు చేస్తూ వచ్చానని చెప్పారు. తన ప్రసంగాలు యూట్యూబ్‌లో అప్‌లోడై.. మంచి వ్యూయర్ షిప్ దక్కించుకున్నాయని తెలిపారు. తన వీడియోలకు దక్కుతున్న ఆదరణకు ప్రతిఫలంగా.. యూట్యూబ్ నెలకు తనకు రూ. 4 లక్షలు చెల్లిస్తోందని చెప్పి షాకిచ్చారు.
హర్యానాలోని సోహ్నాలో ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ వే (డీఎంఈ) పురోగతిని సమీక్షించేందుకు వెళ్లిన సమయంలో.. గడ్కరీ కరోనా సమయంలో గతానుభవాలను వివరించారు