ఇంకొన్ని రోజులలో 2020 ముగిసిపోతుంది. కొత్తగా 2021 లోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సందర్భంగా 2020 కి సంబంధించి కొన్ని విషయాలను ఆయా సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈనేపథ్యంలోనే యూట్యూబ్ ఇండియా 2020 కి సంబంధించి టాప్ టెన్ ట్రెండింగ్ వీడియోలు గురించి ప్రకటించింది.
అందులో లో మూడో తెలుగు పాటలు ఉండటం విశేషం. తెలుగు డాన్స్ షో ఢీ లో పండు చేసిన నాది నక్లెస్ గొలుసు టాప్ టెన్ లో ఆరో స్థానంలో నిలిచింది. ఆగస్టు 5న యూట్యూబ్ లోకి వచ్చిన ఈ వీడియో ఇప్పటివరకు 81,52,8169 న్యూస్ ను సొంతం చేసుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠ పురం లో ని రెండు పాటలు టాప్ 10లో నిలిచాయి. బుట్ట బొమ్మ సాంగ్ మూడవ స్థానంలో నిలవగా, రాములో రాముల 8వ స్థానంలో నిలిచాయి.