సంక్రాంతి పండగ వచ్చేసింది.. పట్టణంలో ఉన్నవారంతా పల్లె బాట పడుతున్నారు. సొంత ఊళ్ళకు వెళ్లి కుటుంబసభ్యులు, బంధువులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. అయితే మరోవైపు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వెండితెరపై వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే బుల్లితెరపై రకరకాల షోలు కూడా వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న నేపథ్యంలో దానినే క్యాచ్ చేసుకుని బుల్లితెర ప్రోగ్రామ్స్ ,ఈవెంట్స్ అన్ని కూడా సామాజిక మాధ్యమాల్లో ఒకటైన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు సంక్రాంతి సమయంలో పండగను పురస్కరించుకుని ప్రతి ఏడాది కూడా కొత్త కొత్త పాటలు యూట్యూబ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ యేడాది కూడా అలానే కొన్ని పాటలు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సంక్రాంతి పాటల్లో ఈ ఐదు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ పాటలు ఏంటో మీరు కూడా చూడండి..