మట్టి మనిషి గంగవ్వ.మాయా మర్మం తెలియని మనిషి. మనకి బాగా కావాల్సిన మనిషి. మనిషి కష్టసుఖాలు తెలిసిన మనిషి. మై విలేజ్ షోతో అందరికీ దగ్గరైంది. ఆరు పదుల వయసులో తనదైన భాషా యాసలతో యూట్యూబ్‌ను షేక్ చేసింది.
బిగ్ బాస్ హౌస్ కి ఆహ్వానాన్ని అందుకుంది. తనదైన జీవన విధానానికి సరిపడని పరిస్థితులు ఉండడంతో అతికొద్ది రోజులకే తిరిగివచ్చేసింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.
గత నెల శివరాత్రి సందర్భంగా మొదటిసారి విమానం ఎక్కి హల్‌చల్ చేసిన యూట్యూబర్ తన విమాన ప్రయాణం గురించి తెలుపుతు ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఇప్పటివరకు ఈ క్లిప్‌కు ఆరు మిలియన్లపైగా వ్యూస్ వచ్చాయి. 5,38,957 మంది లైక్‌కొట్టారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. దీంతోపాటు షెర్‌లు, లైక్ సంఖ్య కూడా అధికమవుతున్నది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోవి ధంగా స్పందిస్తున్నారు.
కొన్నిసార్లు ఇలాంటి వాటికి భాష అక్కర్లేదు అర్థమైపోతుందని ఒక ఇన్‌స్టా యూజర్ తెలుపగా, గంగవ్వ అందరికీ స్ఫూర్తి. విజయం ఏ వయసులోనైనా వస్తుంది.. పని చేస్తూ ఉండండి.
మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి అంటూ మరొకరు రాసుకొచ్చారు. మరి ఇది నిజమే కదా.. వయసుతో పనేముంది. కలలను సాకారం చేసుకోవడానికి.