రాష్ట్రంలో అమరావతి రగడ రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి చెప్పిన తరువాత నుంచే ఈ విషయంలో రగడ మొదలైంది. అమరావతి రైతులు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి రాజధానిని మార్చవద్దని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు చంద్రబాబు, బీజేపీ మద్దతుగా నిలిచాయి. మూడు రాజధానుల ప్రతిపాదన తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. కొంతమంది రైతులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. కాగా, ఈరోజు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే.
ఇక ఇదిలా ఉంటే , ఆర్కే విషయంలో జగన్ రెండుసార్లు షాక్ ఇచ్చారు. మంగళగిరిలో ఆర్కే విజయం సాధిస్తే మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. కానీ, గెలిచిన తరువాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆ తరువాత ఇప్పుడు రాజధాని విషయంలో అమరావతిని నామమాత్రపు రాజధానిగా ఉంచి, కార్యనిర్వాహక రాజధానిని విశాఖకు మార్చి మరోషాక్ ఇచ్చారు. లోకేష్ పై గెలిచినప్పుడు ఇచ్చిన షాక్ కంటే కూడా అమరావతి విషయంలో ఇచ్చిన షాక్ ఆళ్ళకు ఇబ్బంది కలిగిస్తుందనటంలో సందేహమే లేదంటున్నారు రాజకీయ ప్రముఖులు.