రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు పట్టాదారులకే తిరిగి ఇచ్చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసైన్డ్ భూములు ఇచ్చినందుకు గాను గతంలో పట్టాదారులకు ఇవ్వాలని నిర్ణయించిన రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరో వైపు ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు ఉండొచ్చేమో అని అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన వ్యాఖ్య ల పై తీవ్ర దుమారం రేపుతున్న దశలో ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం సంచలనంగా మారింది.