జగన్ ప్రతి వారం కోర్ట్ కు రావాల్సిందే అని సిబిఐ ఇచ్చిన తీర్పు పై, సన్నిహితుల వద్ద ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఈ పరిణామం నైతికంగా పార్టీకి దెబ్బ అని, జగన్ రాజీనామా చేస్తే, పార్టీకి ఎంతో మైలేజ్ వస్తుందని, కోర్ట్ విచారణ అయ్యేదాకా, ఎవరైనా సీనియర్ కు ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలని, ఆ సీనియర్ మంత్రి సూచన చేశాడట.బీజేపీ ఊరుకునే పరిస్థితి లేదని, ప్రజల్లో సానుభూతి రావాలంటే రాజీనామా చేయాలని ప్రతిపాదించారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలు అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.