వైటీపీ అధ్యక్షురాలు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉద్యగ నోటిఫికేషన్లకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. తర్వాత రోడ్డుపై నిరసనకు దిగారు షర్మిల.
ఆమెతోపాటు వైటీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని.. కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంటసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. షర్మిలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు.
ఎంత చెప్పినా వినకపోవడంతో చివరకు షర్మిలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముందు కాసేపు ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయాలని చెప్పారు. నిరుద్యోగులు చనిపోతున్నా.. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఆరోపించారు.