షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
రైతు చనిపోతే కనీసం ఆ రైతు కుటుంబాలను ఓదార్చే దిక్కు లేదు. రైతులను కోటీశ్వరులు చేశామని చెప్పుకొంటూ.. వారిని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నఈ రైతు హంతక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పాతరేద్దాం. దానికోసం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుందాం.
ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేక కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతూ.. కల్లాల్లో కయ్యాలు పెడుతూ.. హస్తినలో దోస్తానా చేస్తూ.. ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులను చనిపోయేలా చేస్తున్నాయి. రైతుల ఆవేదన తీర్చేవారే లేరు.