నిరుద్యోగి సాగర్ ఆత్మహత్య బాధాకరమన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. రిపబ్లిక్ డే సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఉద్యోగాలు రావడం లేదంటూ సాగర్ లాంటి ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు షర్మిల. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అని హామీ ఇన పాలకులు పట్టించుకోకపోవడంతోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
తెలంగాణ కోసం ఎంతమందైతే ఆత్మ బలిదానాలు చేసుకున్నారో ఇప్పుడు నోటిఫికేషన్లు రావడం లేదంటూ అంతమంది చనిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పాలకులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోవాలనే చట్టం ఉంటే బాగుంటుందని అన్నారు షర్మిల. తెలంగాణలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని.. పోలీసుల్ని పనోళ్ళలా వాడుకుంటున్నారని విమర్శించారు. రూల్స్ పాలకపక్షానికి ఒకలా? ప్రతిపక్షాలకు మరోలా ఉండటంపై మండిపడ్డారు.