షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
కేసీఆర్ కు రెండుసార్లు ఓట్లేస్తే ఎవరికీ ఏం చేయలె. పోడు పట్టాలిస్తానని మోసం చేసిండు. టీఆర్ఎస్ పార్టీకి రూ.860కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ అట.. నెలకు రూ.3కోట్ల మిత్తి వస్తుందట. ప్రజలకేమో అప్పులు, ఆత్మహత్యలు, మీకేమో బ్యాంక్ బ్యాలెన్సులా? ప్రజల సొమ్ముతో కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ లీడర్లు జల్సాలు చేస్తున్నరు.
రేట్లు పెంచి ప్రజలపై భారం మోపుతున్నరు. నీళ్లు, రోడ్లు లేవు కానీ మద్యం ఏరులై పారుతోంది. చిన్నారులకు, మహిళలకు రక్షణే లేదు. కేసీఆర్ అపరచితుడు. ఒకసారి మాటిస్తడు. మళ్లీ నేను అనలే అంటడు. రెండు సార్లు నమ్మినం. మళ్లీ నమ్మి మోసపోవద్దు. ఎన్నికలు వస్తున్నాయి అంటే ఆకాశంలో చందమామ అంటడు. గాడిదను ఆవు అని నమ్మిస్తడు. ఆయన ఛాతీలో ఉన్నది గుండె కాదు బండ.
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని దొంగల, దోపిడీ రాజ్యంగా మార్చారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. ఆయన బాటలోనే నేను నడుస్తాను. రైతులు పండించిన పంటను కూడా రాజకీయం చేయడం కేసీఆర్ కు చెల్లుతుంది. భూములు గుంజుకున్నారని బుధవారం ఒక మహిళ చనిపోయింది. కేసీఆర్ పేదల భూములు లాక్కొని ఆత్మహత్యలకు కారణమైతున్నరు.
ప్రభుత్వం చేపట్టే పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటికలు, నూతన కార్యాలయాల నిర్మాణం కోసం బలవంతంగా గిరిజనుల భూములు లాక్కుంటున్నారు. మేము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇవ్వటంతో పాటు రైతులకు అండగా ఉంటాం. మంత్రుల మీద కేసులు లేవట. గౌతమ బుద్ధులట. మంత్రుల భూకబ్జాలు, అరాచకాలు కంటికి కనిపించలేదా? వాళ్ల వేధింపులతో చనిపోయిన ప్రజల ఆత్మహత్యలు కనిపించలేదా? బంగారు తెలంగాణ అయింది కేసీఆర్ కుటుంబానికి, టీఆర్ఎస్ లీడర్లకే. మీ దరిద్రం ఇక్కడితో చాలక దేశాన్ని కూడా నాశనం చేస్తారా?
వైఎస్ పుణ్యం వల్లే టీఆర్ఎస్ భవన్ ఏర్పడింది. వ్యవసాయ మంత్రి అంటాడు రైతులకు రూ.3.70 లక్షల కోట్లు ఖర్చు చేశారట. మీరు రుణమాఫీ చేశారా? నష్ట పరిహారం ఇచ్చారా? రైతు బీమా ఇచ్చారా? సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇచ్చారా? అంత ఖర్చు చేస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు?