షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
ఇది యాసంగి పంటలు వేసుకునే కాలం అని చెప్పిన మీకు, ఆ కాలం కూడా వెళ్లిపోతుంది అని తెలియడం లేదా దొరా? పంట వేసుకోవాల్సిన రైతు ఇంకా వానాకాలం పంట అమ్ముడుపోక, కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తుండు. చివరి గింజ వరకు కొంటాం అని చెప్పిన మాటల మొనగాడు, ఇప్పటి వరకు కొన్నది 30 శాతమే.
కొంటాడో కొనడో తెలియక ధాన్యం కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారు మాత్రం ధాన్యం కొనకుండా రాజకీయాలు చేస్తున్నాడు. ఇప్పటికే 2 నెలలుగా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ రైతులు గోస పడుతున్నారు. అన్నదాతలు తిరగపడక ముందే పంట మొత్తం కొనాల్సిందే. లేకపోతే కేసీఆర్ మూట ముల్లె సర్దుకోవాల్సిందే.