సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రశ్నల వర్షం కురిపించారు. నిరుద్యోగులు ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని ప్రశ్నించారు.
టీచర్ నుండి డాక్టర్ దాకా అందరినీ కాంట్రాక్ట్ పెట్టుకుంటున్నారని… సీఎం పదవి కూడా అలాగే చేస్తే సరిపోతుందిగా అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ పదమే ఉండదని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు పరిపాలన అంత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితోనే నడిపిస్తున్నారని విమర్శించారు.
ఏళ్ల తరబడి నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం చూస్తున్నా.. కేసీఆర్ ఇచ్చింది లేదని మండిపడ్డారు షర్మిల. అటు కాంట్రాక్టు ఉద్యోగులతో చాకిరి చేయించుకొంటూ చాలీచాలని జీతాలతో వారి శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు.
మరోవైపు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ నిరుద్యోగులు చనిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలే కాకుండా ఔట్ సోర్సింగ్ ఖాళీలను కూడా రెగ్యులర్ గా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల.