వైఎస్‌రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన మాజీ పీసీసీ చీఫ్, రాజ్యసభ మాజీ ఎంపీ డి. శ్రీనివాస్ ను వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయన నివాసంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు.
కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఆమె పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. దాంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న పాత అనుభవాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య కాసేపు ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో వైఎస్సార్ పై అభిమానం చెక్కు చెదరకుండా ఉందని ఆయన అన్నారు. వారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఆయన బిడ్డ అయిన షర్మిల మీద ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంటుందన్నారు.
రాజశేఖర్ కూతురుగానే కాకుండా వైఎస్ షర్మిలను ఒక ఐరన్ లేడిగా ఆయన పేర్కొన్నారు. ఒంటరిగా ఒక మహిళ చేస్తున్న పోరాటం గురించి ఆయన కొనియాడారు. నాకున్న రాజకీయ అనుభవంతో చెప్తున్న కచ్చితంగా షర్మిల ముఖ్యమంత్రి అవుతారని ఆయన పేర్కొన్నారు.
అప్పట్లోనే వైఎస్సాఆర్ ముఖ్యమంత్రి అవుతారని నేను చెప్పానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.వైఎస్ సీఎల్పీ నేతగా ఉండగా… డీఎస్ పీసీసీ చీఫ్‌గా వ్యవహరించారు. వీరిద్దరి ఉమ్మడి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వైఎస్ సీఎం కాగా… డీఎస్ ఆయన కేబినెట్‌లో కీలక శాఖల మంత్రిగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లోనే కాంగ్రెస్ పార్టీ 2009లో మరోమారు విక్టరీ కొట్టింది.