సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. విద్యా వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారని మండిపడుతూ ట్వీట్ చేశారు. చదువు చెప్పేటోడు లేకుంటే… చదువుకునేటోడు ఉండడని, చదువులేకపోతే ప్రశ్నించే టోడు ఉండడని, కొలువులు అడిగేటోడు ఉండడని, బడులు బంద్ పెట్టి.. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను నియమించకుండా .. విజ్ఞానాన్ని దూరం చేస్తూ .. KCR గారు .. తన ఎజెండాను .. 100 కు 100 శాతం అమలు చేస్తున్నారు అంటూ విమర్శించారు.
యూనివర్శిటీల్లో 2837పోస్టులకు 1867పోస్టులు ఖాళీగా ఉన్నాయని వైఎస్ షర్మిల విమర్శించారు. 90శాతం భోదనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో మొత్తం 11లో
7 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు
100 కు 100% లేరు.
ఒక్క ఉస్మానియా తప్పితే
మిగిలిన వాటిలో 90% బోధన సిబ్బంది ఖాళీనే.
యూనివర్సిటీల్లో 2837 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే,
1867 పోస్టులను భర్తీ చేయకుండా విద్యావ్యవస్థను
భ్రష్టు పట్టిస్తున్నాడు KCR సారు.2/2— YS Sharmila (@realyssharmila) September 5, 2021
Advertisements