సీఎం కేసీఆర్ పై వైటీపీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కేసీఆర్ వెళ్లకపోవడాన్ని టార్గెట్ చేస్తూ ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ మోడీని కడుగుతా.. తోముతా.. దేశంలో భూకంపం తెప్పిస్తానన్న దొర.. ప్రధాని హైదరాబాద్ వస్తే ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని
మోడీకి ఎదురుపడి ఎందుకు అడుగలేదని నిలదీశారు.
బండ బూతులు తిట్టిన నోటితో బాగున్నారా అని అడుగలేకపోయారా? అంటూ కేసీఆర్ కు చురకలంటించారు షర్మిల. అంతటితో ఆగకుండా.. అక్కడకు వెళ్తే.. మోడీతో మీకున్నా దోస్తానీ బయటపడుతుందని వెళ్లలేదా? అని అడిగారు. జ్వరం వంక పెట్టుకొని కార్యక్రమానికి డుమ్మా కొట్టారా? అని ప్రశ్నించారు.
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు పోని పాపాన్ని కడుక్కోవటానికి ఇప్పుడు యాదాద్రి యాగానికి వెళ్ళారా? అంటూ సెటైర్లు వేశారు. ఏదిఏమైనా దొరగారి జ్వర రాజకీయం బాగుందని విమర్శించారు షర్మిల.