తెలంగాణలో ఇప్పుడు మరో పాదయాత్ర మొదలుకానుంది. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలోనే ఈ ప్రజా ప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ 7 సంవత్సరాల పాలనలో కేసీఆర్, ఆయన కుటుంబం పాలిస్తున్న తీరుతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగుతుందన్నారు.
అక్టోబర్ 20న మొదలయ్యే ఈ పాదయాత్రను వైఎస్ లాగే చేవెళ్ల నుండి ప్రారంభించనున్నారు. జీహెచ్ఎంసీ మినహా అన్ని ఉమ్మడి జిల్లాలను కవర్ చేయబోతున్నారు. దాదాపు 90 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర సాగుతుందని… మళ్లీ చేవెళ్లలోనే ముగుస్తుందన్నారు.
తెలంగాణలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంక్షేమ పాలన అందిస్తామన్న నమ్మకాన్ని ప్రజల్లో ఈ పాదయాత్రతో కలిగిస్తామన్నారు వైఎస్ షర్మిల.