వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అయితే.. నాగారం మండల కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది.
షర్మిల యాత్రను టీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల బృందంపై గులాబీ శ్రేణులు చెప్పులు విసిరినట్లుగా చెబుతున్నారు. షర్మిలకు వ్యతిరేకంగా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు చేశారు.
మాట ముచ్చట కార్యక్రమం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన టీఆర్‌ఎస్ శ్రేణులు దౌర్జన్యం చేశారని మండిపడుతున్నారు వైటీపీ నాయకులు. ఎమ్మెల్యేల ప్రోద్బలంతో టీఆర్‌ఎస్ నాయకులు ఇలా బరితెగిస్తున్నారని ఫైరయ్యారు.
పోలీసులు ఎంటర్ అయి ఇరు వర్గాలను నిలువరించారు. నాగారంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజాప్రస్థానం పాదయాత్ర 41 రోజులు పూర్తి చేసుకుంది.