ఎన్నో సంక్షేమ పథకాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మహానేతగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన వైఎస్సాఆర్ ను ప్రజలు గుర్తుపెట్టుకున్నప్పటికీ… ప్రభుత్వం మాత్రం గుర్తించలేదని అసహానం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌ను వైఎస్ ఎంతో అభివృద్ధి చేశారని..అలాంటి వ్యక్తిని స్మరించుకోవడానికి కనీసం సెంటు స్థలం కూడా లేదని విమర్శించారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ స్మారకం కోసం 20 ఎకరాల స్థలాన్నికేటాయించారని..కానీ ఇప్పటి ప్రభుత్వం ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల అన్నారు. ఈ రోజు వైఎస్సార్టీపీ ఆవిర్భావ వేడుకలను హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎవరితోనూ పొత్తు ఉండదు..
తెలంగాణలో తన పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందనే అంశం పైన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల క్లారిటీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ దిశగా చేస్తున్న ఆలోచన పైన స్పందిస్తూ..బీఆర్ఎస్ ఒక తుగ్లక్ ఆలోచనగా అభివర్ణించారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. తెలంగాణ లో ముందస్తు ఎన్నికల ముచ్చటే ఉండదని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు సమీకరణాలు మారుతాయని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్టీపీ స్థాపించి ఏడాది పూర్తయిందని..ఈ సంవత్సర కాలంలో పార్టీ ఎంతో పురోగతి సాధించిందని షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పటికీ నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్న విషయాన్ని గుర్తు చేసారు. ఇప్పటికే 1500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసినట్లుగా వివరించారు.
వైఎస్సార్ కు ద్రోహం చేసింది
కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ ను కాంగ్రెస్ ఏం చేసిందంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిందన్నారు. ఆయనకు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్నారు. ఆ శాపమే ఇప్పుడు కాంగ్రెస్ – టీఆర్ఎస్ ను వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను అభిమానిస్తున్నారు కానీ, వైఎస్సార్ ను గుర్తించక పోవటం వెనుక ఉద్దేశాలు స్పష్టం అవుతున్నాయని చెప్పారు.
ఓ విధంగా చెప్పాలంటేకేసీఆర్ ను సీఎం చేసింది వైఎస్సారే టీఆర్ఎస్ కార్యాలయానికి స్థలం వైఎస్సార్ ఇచ్చారని గుర్తు చేసారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ గురించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ దొంగ.. అడ్డంగా దొరికారు. ఆయన చెబితే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. రోశయ్య కేబినెట్ లో సబితా, దానం నాగేందర్ ఉన్నారని గుర్తు చేసారు. వీరికి రాజకీయంగా వైఎస్సార్ జన్మనిచ్చారని వ్యాఖ్యానించారు.
Advertisements
వైఎస్సార్ మెమోరియల్ హైదరాబాద్ లో ఉండాలని షర్మిల డిమాండ్ చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా..వైసీపీ పైన స్పందించేందుకు షర్మిల నిరాకరించారు. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలే జరుగుతాయని చెప్పారు.