సీఎం కేసీఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులంతా ఓవైపు పిట్టల్లా రాలిపోతున్నారని, ఇంకెంత మంది ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ స్పందిస్తారు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు.
నిరుద్యోగుల కోసం హన్మకొండలో దీక్ష చేపట్టిన షర్మిల… తాను పది వారాలుగా నిరుద్యోగ దీక్ష చేస్తున్నానన్నారు. అయినా సర్కార్ కు చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్శిటీ వద్ద ప్రొ.జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం దీక్ష చేపట్టారు.