వైఎస్ షర్మిల… ఎన్నికల సమయంలో తప్ప ఈ పేరు ఎక్కడ వినిపించదు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాలని పాదయాత్రలు చేసి మొత్తానికి ముఖ్యమంత్రిని చేశారు. ఇక ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు షర్మిల. తాజాగా మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేసిన తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆమె మరోసారి ప్రశంసలు కురిపించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తున్నా.. మరోవైపు కరోనా ఖర్చు భారంగా మారినా.. ప్రజలకు మంచి చేయాలనే నీ ధృడ సంకల్పానికి హాట్సాఫ్ అన్నా అంటూ ట్విట్ చేశారు. నీ స్వచ్ఛమైన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు ఆ దేవుడి దయ, ప్రజల దీవెనలు, పైనుంచి నాన్న ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటాయి జగనన్న అంటూ వ్యాఖ్యానించారు.
ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తున్నా.. మరోవైపు కరోనా ఖర్చు భారంగా మారినా.. ప్రజలకు మంచి చేయాలనే నీ ధృడ సంకల్పానికి హాట్సాఫ్ అన్నా..@ysjagan #YSRMatsyakaraBharosa #YSJaganCares pic.twitter.com/UVP38Uhwn8
— YS Sharmila (@ys_sharmila) May 6, 2020
అంతకుముందు జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రవేశపెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధుల విడుదలపై స్పందిస్తూ పేదలకు మేలు చేయడానికి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే… తాను రెండు అడుగులు ముందుకేస్తానని తన అన్న వైఎస్ జగన్ మాట ఇచ్చారని గుర్తు చేశారు.