తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాట్లలో ఉన్న వైఎస్ షర్మిల… ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ నుండి తన పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నారు. ఇప్పటికే వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం అంటూ జిల్లాల వారీగా నాయకులతో సమావేశం అవుతున్న షర్మిల… కీలక నిర్ణయం ప్రకటించారు.
తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుండి తాను ఎన్నికల బరిలో ఉంటానన్నారు. వైఎస్ కు పులివెందుల ఎలాగో… తనకు పాలేరు అంత సెంటిమెంట్ అని, తమ ప్రభంజనాన్ని ప్రత్యర్థి పార్టీలు తట్టుకోలేరంటూ షర్మిల వ్యాఖ్యానించారు.