తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయన్నారు.పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు ఇప్పుడు రూ.307కు చేరిందని మండిపడ్డారు. ఇక పెరిగిన చార్జీలన్నీ 50,100,200 యూనిట్లలోపు వాడుకొనే పేద, మధ్య తరగతి వాళ్లకే భారమని వెల్లడించారు.
గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా బస్ చార్జీలు.. కరెంట్ చార్జీలు.. ఇంటి పన్ను ఒక్క పైసా పెంచలేదని గుర్తు చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం అయిన కేసీఆర్.. మాత్రం పన్నులు పెంచడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
అధిక పన్నులతో పేదోని నడ్డి విరుస్తున్నాడని నిప్పులు చెరిగారు. పన్నులు, చార్జీలు తోచినంత పెంచి జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. పేద ప్రజల రక్తం తాగుతున్నారని విమర్శించారు వైఎస్ షర్మిల.