విజయవాడ: వైసీపీ నేతలు అనుకున్నది సాధించారు. ట్రాఫిక్ సమస్యకు కారణం అవుతోందని గతంలో చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన వైఎస్ విగ్రహాన్ని అదే చోట తిరిగి ప్రతిష్టించారు. విజయవాడ నగరం నడిబొడ్డున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర వైఎస్ విగ్రహాన్ని ఆయన తనయుడు, సీయం జగన్ ఆవిష్కరించారు. వైఎస్ పదో వర్ధంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు పట్టుబట్టి ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. విగ్రహం వున్నపార్కు ప్రాంతాన్ని వైఎస్ఆర్ పార్కుగా పేరు పెట్టారు.