టీటీడీ బోర్డు చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే ఆయన పదవీ కాలం పూర్తవడంతో మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీటీడీ చైర్మన్ గా నియమితులయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అయితే పదవీ కాలం పూర్తయ్యాక వేరే వ్యక్తిని నియమిస్తారని వార్తలొచ్చాయి. కానీ.. సుబ్బారెడ్డికే బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. త్వరలోనే బోర్డు సభ్యులకు సంబంధించిన ప్రకటన రానుంది.
Advertisements