- వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు అనుమానిస్తున్న కసునూరు శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య…
- ఈ హత్య కేసులో తనను, తన కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్…
- పులివెందుల సిఐ శ్రీరాములు తీవ్ర వేధింపులు భరించలేక ఈ ఘటనకు పాల్పడినట్లు నోట్‌లో వెల్లడి…
- కడప ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాసులురెడ్డి…
- సీఎం వైఎస్ జగన్‌కు, వైఎస్ భాస్కర్‌రెడ్డిలకు లేఖ…
- సూసైడ్ నోట్‌ను కుటుంబ సభ్యులకు అందజేసిన డాక్టర్లు…
- కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులురెడ్డి
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాసులరెడ్డి అనే నిందితుడు మృతిచెందాడు. పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్టు శ్రీనివాసులరెడ్డి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. వివేకా హత్యకేసుతో తనకు సంబంధం లేదంటూ లేఖలో వాపోయాడు. సీఎం జగన్, వైఎస్ భాస్కర్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి వేరు వేరుగా లేఖ రాశాడు. సూసైడ్ నోట్‌ను కుటుంబ సభ్యులకు డాక్టర్లు అందజేశాడు. సీఐ రాములు తీవ్రంగా వేధించినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్యపై ఆయన కుమారుడు స్పందించాడు. ‘రెండ్రోజుల క్రితం పోలీసులు విచారణకు పిలిచారు. వివేకానందరెడ్డి హత్యకేసుతో సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కోవడంతో అవమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్ కుటుంబం అంటే మా నాన్నకు చాలా అభిమానం’ అని శ్రీనివాసులురెడ్డి కుమారుడు చెబుతున్నాడు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వివేకానందరెడ్డి హత్యకేసులో విచారణను వేగంవంతం చేసింది. వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్యకు నార్కో అనాలసిస్, పాలిగ్రాఫ్, బీప్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. దీనికి న్యాయమూర్తి కిశోర్‌కుమార్ అనుమతిచ్చారు. ఆ వెనువెంటనే పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో రంగయ్యను హైదరాబాద్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. విచారణలో భాగంగా పోలీసులు అప్పట్లో సుమారు 60 మందిని ప్రశ్నించారు. చివరకు సాక్ష్యాలు తారుమారుచేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 90 రోజుల రిమాండ్ అనంతరం వీరికి జూన్ 27న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.