ఈయన గారు పడుకోడానికి పార్లమెంటే దొరికిందా? - Tolivelugu

ఈయన గారు పడుకోడానికి పార్లమెంటే దొరికిందా?

 

, ఈయన గారు పడుకోడానికి పార్లమెంటే దొరికిందా?

మనకు ఏదో చేస్తారని…మన సమస్యలను పరిష్కరిస్తారని…ఎన్నో ఆశలతో ఓట్లేసి ఎన్నుకున్న నాయకులు చట్టసభల్లో చల్లగ నిద్రపోతుంటే మనకు ఏమనిపిస్తుంది..?…. అవును..అదే అనిపిస్తుంది. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎం.పి గోరంట్ల మాధవ్ ను చూస్తే అదే అనిపిస్తుంది. హైదరాబాద్ లో జరిగిన ఓ ఘోరకలిపై దేశమంతా అట్టుడికిపోతుండగా…లోక్ సభలో జస్టిస్ ఫర్ దిశ పై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా…ప్రభుత్వం సావధానంగా వింటోంది. దేశంలోని ప్రజలు టీవీల్లో ఆ చర్చను ఆసక్తిగా చూస్తున్నారు. కానీ మహిళల రక్షణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని సదరు ఎం.పి గారు హాయిగా నిద్రపోయారు.

, ఈయన గారు పడుకోడానికి పార్లమెంటే దొరికిందా?

ఈ సార్‌ ను టీవీల్లో చూసిన వాళ్లు ముక్కున వేలేసుకున్నారు. గతంలో పోలీస్ ఉద్యోగం చేసిన ఈయన ఎంత ఘనంగా వెలగబెట్టాడో నని అనుకుంటున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp