మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పుపై గత 17 రోజులుగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రైతులకు సంఘీభావం తెలుపుతూ చంద్రబాబు, భువనేశ్వరి రాజధాని గ్రామాల్లో పర్యటించారు. రైతుల కష్టాలను చూసి అమరావతి పరిరక్షణ సమితికి తన బంగారు గాజును విరాళంగా ఇచ్చారు. ఇదే విషయమై అధికారపార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ చివరి రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ కే అన్నం పెట్టలేని భువనేశ్వరి, తన గాజులు తాకట్టుపెట్టి రాజధాని రైతులకు పరమాన్నం పెడతాను అన్నారట అంటూ సెటైర్లు విసిరారు.