వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాద్ పాతబస్తీలో పర్యటించారు. మొహర్రం సందర్భంగా డబీర్ పూర్ లోని బీబీకా ఆలంను ఆమె సందర్శించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పాతబస్తీ పర్యటన వివరాల్ని షర్మిల ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముస్లిం సోదరులు, సోదరీమణులతో కలిసి చాదర్ సమర్పించడం జరిగిందని తెలిపారు.
ఇమామ్ హజరత్ హుస్సేన్ ప్రజల హక్కుల కోసం పోరాడారని గుర్తు చేశారు. అలాగే.. తెలంగాణలో హక్కుల కోసం తాము పోరాడతామని చెప్పుకొచ్చారు షర్మిల.