మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నామన్న సీఎం కేసీఆర్ ప్రకటనపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు సీఎం కేసీఆర్ సొంత ఆస్తి అయినట్టు ఫీల్ అవుతున్నారంటూ ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రజల ఆస్తి అన్నారు. రాజకీయాల కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఎలా దారదత్తం చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ అనే పేరును సీఎం కేసీఆర్ తీసి వేశారంటూ ఆమె ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు జై తెలంగాణ అనే దమ్ము లేదన్నారు. కేసీఆర్‌కు మహారాష్ట్ర రైతేలే రైతులా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రైతుల మరణాలకు కేసీఆర్ బాధ్యుడు కాదా..? అంటూ ఆమె తీవ్రస్థఆాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్రకు .నీళ్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ నిన్న అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర సహకారంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిందన్నారు. అవసరమైతే శ్రీరాంసాగర్ నీటిని మహారాష్ట్ర లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.