యాదాద్రి: ‘తొలివెలుగు’ దెబ్బతో బొమ్మ పడి దిమ్మతిరిగిన కేసీఆర్ సర్కార్ వెంటనే యాదాద్రిలో ఆఘమేఘాల మీద దిద్దుబాటు చర్యల్ని చేపట్టింది. ఆలయ గోడలపై అంతకు ముందు అమర్చిన కేసీఆర్, టీఆర్ఎస్ కారు, కేసీఆర్ కిట్ వంటి బొమ్మలన్నీ తీయించేసి వాటికి బదులు లతలు, పూవులు వంటి డిజైన్లతో చేసిన రాతి బొమ్మల్ని అమర్చుతోంది. అధికారులు అక్కడే వుండి ఈ దిద్దుబాటు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. బూతు బొమ్మలు వుండవని ముందు బుకాయించిన కిషన్‌రావు తరువాత వాటిని సాక్ష్యాధారాలతో సహా ‘తొలివెలుగు’ వెలువరించిన కథనం చూసి ఖిన్నులయ్యారు. ఇప్పుడు తొలిగించిన చిత్రాల్లో ఈ బూతు బొమ్మలు కూడా వున్నట్టు సమాచారం. అసలీ వ్యవహారం తమకేం తెలియదని తేల్చిన అధికారులు చివరికి దీన్ని చినజీయర్ స్వామి మీద నెట్టే ప్రయత్నం చేశారు. చినజీయర్ స్వామి దానికి వివరణ ఇవ్వడం మానేసి.. సినిమా వాళ్లు నిర్వహించిన కార్యక్రమంలో ధర్మోపన్యాసం ఇవ్వడానికి వెళ్లారు.
తొలగించిన చిత్రాల స్థానంలో అమర్చిన బొమ్మలు ఇక్కడ చూడచ్చు..