షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
18 ఏండ్ల క్రితం వైఎస్ కట్టిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చెక్కు చెదరకుండా పనిచేస్తోంది. లక్షల కోట్లు అప్పు తెచ్చి మరీ.. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని కన్నెపల్లి, అన్నారం పంపు హౌస్ లు మునిగిపోయాయి. పట్టుమని రెండేండ్లు కూడా కాకుండానే నీళ్లలో నానుతున్నాయి.
13 లక్షల క్యూసెక్కుల వరదకు అన్నారం పంపుహౌస్ 28 లక్షల క్యూసెక్కుల వరదకు కన్నెపల్లి పంపుహౌస్ మునిగితే, 29.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా దేవాదుల పంపు హౌస్ చెక్కుచెదరలేదు.
రికార్డ్ వరదను సైతం తట్టుకొని దేవాదుల నిలబడింది. సమర్ధత గల నాయకుని పనితీరుకు నిదర్శనం వైఎస్‌ఆర్ దేవాదుల. అనవసరమైన ఖర్చుకు, అవినీతికి నిదర్శనం కేసీఆర్ కాళేశ్వరం.
ఆంధ్రోళ్ల అణిచివేతలైపోయినయ్, ప్రతిపక్షాల పన్నాగాలు అయిపోయినయ్, తిరుగుబాటుదారుల వెన్నుపోటులు అయిపోయినయ్, జాతీయ పార్టీల జిమ్మిక్కులు అయిపోయినయ్, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అయిపోయింది, ఇక అంతర్జాతీయ కుట్రలు మొదలైనయ్. ఒక్క వరదకే ఎన్ని కష్టాలొచ్చినయ్ మన కేసీఆర్ దొరకి.