టీం ఇండియా మాజీ ఆటగాడు, డాషింగ్ ఆల్ రౌండ్ యువరాజ్ సింగ్ తన 39వ పుట్టిన రోజున రైతు ఉద్యమంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని, ఇలాంటి పుట్టిన రోజులు వస్తూ పోతుంటాయి కానీ ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమం శాంతియుతంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
రైతు ఉద్యమానికి తన తండ్రి యోగరాజు మద్ధతిచ్చాడని… అయితే తన తండ్రి అభిప్రాయంతో తాను విభేదిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని కానీ రైతుల కోసం ఎందరో తమ అవార్డులు కూడా వాపస్ ఇస్తున్నందున రైతుల సమస్యలపై లోతైన చర్చలు జరగాలని రాసుకొచ్చాడు.
మొత్తంగా దేశానికి వెన్నుముక అయిన రైతన్నకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపి.. జై జవాన్ జైకిసాన్ జై హింద్ అంటూ ముగించాడు.
— Yuvraj Singh (@YUVSTRONG12) December 11, 2020