టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ ఆల్‌రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో బీసీసీఐ సెలెక్టర్లు ఎమోషనల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రోహిత్‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించిన సమయంలోనూ అతడు ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడని గుర్తు చేశారు. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదని యువీ అభిప్రాయపడ్డాడు.
‘ఫిట్నెస్ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని రోహిత్ శర్మను టీమిండియా టెస్టు కెప్టెన్‌గా చేశారు. అది భావోద్వేగపరమైన నిర్ణయమని నా అభిప్రాయం. అతడు ఎక్కువగా గాయాలపాలవుతున్నారు. ఈ వయసులో శరీరాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అలాంటి ఆటగాడిని టెస్టు సారథిగా నియమించకూడదు. ఇది అతడి కెప్టెన్సీపైనా ప్రభావం చూపుతుంది. టెస్టు మ్యాచ్‌లలో రోహిత్ శర్మ ఓపెనింగ్ స్థానంలో ఆడటం ప్రారంభించి రెండేళ్లే అవుతోంది. అతడు బాగా ఆడుతున్నారు. అతడి దృష్టి బ్యాటింగ్‌పై ఉంచుకోవాలి. కానీ, ఐదు రోజులు గ్రౌండ్లో నిల్చోవడం కష్టం’ అని యువీ చెప్పుకొచ్చారు.
అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్‌కు ఇంకా ముందే కెప్టెన్సీ దక్కాల్సి ఉండేదని, అయితే కోహ్లి అన్ని ఫార్మాట్లలో అదరగొడుతుండటంతో ఆ అవసరం భారత్‌కు లేకపోయిందని యువీ చెప్పారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ అద్భుతమైన నాయకుడని, ఈ విషయాన్ని తాను ఐపీఎల్‌లో అతని సారధ్యంలో ఆడుతుండగా గ్రహించానని తెలిపారు. రోహిత్ అద్భుతమైన నాయకుడని, అతను చాలా మంచి ఆలోచనాపరుడని, వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా తన ఓటు రోహిత్‌కేనని యువీ తెలిపారు.
ఈ ఏడాది జరిగిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ అనంతరం టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. అప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా రోహిత్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే టెస్టు కెప్టెన్సీనీ అతడికే అప్పగించింది బీసీసీఐ. అయితే, రోహిత్ గాయాల వల్ల గత రెండేళ్లలో కీలక సిరీస్‌లకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో అతడి బదులు మరో ఆటగాడిని టెస్టు సారథిగా ఎంపిక చేయాల్సిందని అప్పుడే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.