రిపోర్టర్ అవతారమెత్తాడు టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. ఒక రిపోర్టర్ లా డ్రెస్సింగ్ రూమ్ గురించి వివరిస్తూ నవ్వులు పూయించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ఆ వీడియోలో చాహల్ ఓ మైక్ పట్టుకుని మాట్లాడుతూ.. షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నరేషనల్ క్రికెట్ స్టేడియంను చూపించాడు.
ఆ తర్వాత మా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్దాం రండి అంటూ లోపలికి వెళ్లాడు. అక్కడ సీటింగ్ ఏరియాను చూపిస్తూ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన మా కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ కూర్చుని ఉన్న రోహిత్‌ను చూపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లి ఓ చిన్న ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు.
మసాజ్ టేబుల్ గురించి చెబుతున్న సమయంలోనే ఫ్రేమ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ ఫన్నీ కామెంట్ చేశాడు. రిపోర్టింగ్ చేస్తున్న చాహల్ తో నవ్వుతూ నీకు చాలా గుడ్ ఫ్యూచర్ ఉంది అనుకుంటూ వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడున్న వంటకాలను చూపిస్తూ.. ఒక్కో వంటకం పేరు చెప్తూ వెళ్లాడు చాహల్. ఈ వీడియోపై నెటిజన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. రెండో వన్డే ఆడేందుకు రెండు జట్లు రాయ్ పూర్ కు చేరుకున్నాయి.
Inside #TeamIndia‘s dressing room in Raipur! 👌 👌
𝘼 𝘾𝙝𝙖𝙝𝙖𝙡 𝙏𝙑 📺 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 👍 👍 #INDvNZ | @yuzi_chahal pic.twitter.com/S1wGBGtikF
— BCCI (@BCCI) January 20, 2023