ప్రభుత్వం మనదే.. బోర్డు మనదే.. కొండ కూడా మనదే.. అనుకున్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు అన్నీ మార్చేద్దామనుకున్నారు. మనమేం చెబితే అంతే కాబట్టి అన్నీ చక్కబెట్టేయొచ్చనుకున్నారు. మన వైవీ సుబ్బారెడ్డిగారు.. విజయసాయిరెడ్డిగారు. ఇద్దరూ కూడబలుక్కుని.. ఎన్నికలకు ముందు విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులపైన పెట్టిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకునేట్లు పిటిషన్ వేసేశారు. అలా పిటిషన్ వేస్తే కోర్టులో కట్టిన 2 కోట్లు పోతాయని తెలిసినా.. ముందుకు దూసుకుపోయారు. కాని డామిట్ కథ అడ్డం తిరిగింది.. వేసిన పిటిషన్ నే వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకలా?
ఇది కాస్త వినటానికి విచిత్రంగానే ఉన్నా.. జరిగింది ఇదే. రమణ దీక్షితులును ఎన్నికలకు ముందు బాగా వాడేశారు.. పాపం ఆయన కూడా అసంతృప్తితో ఉండటంతో.. వాళ్లు అలా కీ ఇవ్వగానే ఇలా రెచ్చిపోయారు. ఆ వజ్రం కనపడటం లేదు.. ఈ వజ్రం కనపడటం లేదు.. వంటశాల కింద తవ్వేశారు.. గుప్త నిధులు దొరికాయి.. అవి నొక్కేశారు.. ఆగమశాస్త్ర నిబంధనలను తొక్కి పాతరేశారంటూ వరుసబెట్టి బాంబులు వేశారు. ఆయనలా వేయటం.. విజయసాయిరెడ్డి వెంటనే ట్విట్టర్ లో పెట్టడం.. అవి వైసీపీ సైనికుల ద్వారా సోషల్ మీడియాలో ఫుల్లుగా తిప్పేయడం జరిగిపోయింది. అప్పట్లో మరి టీడీపీ ప్రభుత్వం కాబట్టి.. వెంటనే టీటీడీ ఈవోను ఆదేశించి.. వీరిద్దరి మీద పరువునష్టం కేసు వేయించారు. ఆ కేసును అధికారంలోకి రాగానే తీయడం కోసం కసరత్తు చేసి.. పిటిషన్ అయితే వేశారు.
విత్ డ్రా పిటిషన్ వేసేటప్పుడు సీక్వెన్స్ ఎలా ఉంటుందో పాపం ఊహించలేకపోయారు. తీరా పిటిషన్ వేశాకా.. వాళ్లని వీళ్లని సంప్రదించాక వారికి అసలు సంగతులు అర్ధమై.. పాపం ఇప్పుడు ఆ పిటిషన్ విత్ డ్రా చేయించేశారు. విషయం ఏంటంటే.. రమణ దీక్షితులు అప్పుడు టీడీపీ మీద ఎంత అసంతృప్తిగా ఉన్నారో.. ఇప్పుడు వైసీపీ మీద కూడా అంతకంటే రెట్టింపు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే టీడీపీ ఎటూ పట్టించుకోలేదు.. వైసీపీ పట్టించుకుంటామని మాటిచ్చి.. ట్రాప్ చేసి తర్వాత వదిలేశారు.
రమణ దీక్షితులకు మాటిచ్చిన విజయసాయిరెడ్డి తర్వాత న్యాయం చేయలేకపోయాడు. ఎందుకంటే.. అటు జగన్ వైపు నుంచి ఓ లాబీ.. ఇటు వైవీ సుబ్బారెడ్డి వైపు నుంచి మరో లాబీ.. ఈ రెండు లాబీలను దాటి.. కొండ మీద పనవ్వలేదు. దీంతో రమణ దీక్షితులకు ఫుల్లు కోపం వచ్చింది. అది కూడా వైవీ సుబ్బారెడ్డి మీద బాగా వచ్చింది. అందుకే కరోనా టైమ్ లో టెంపుల్ ఎందుకు ఓపెన్ చేశారంటూ ఓపెన్ గానే తిట్టారు. అర్చకులకు వైరస్ సోకితే కూడా పట్టించుకోరా.. వాళ్ల ప్రాణాలకు విలువ ఇవ్వరా అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి రమణ దీక్షితులు కోర్టులో కోఆపరేట్ చేస్తారా అని అనుమానం వచ్చింది. ఎంక్వయిరీ చేసుకుంటే నిజమేనని తేలింది.
పైగా రమణ దీక్షితులు అడ్డం తిరిగాక.. కోర్టులో పరిస్ధితి ఎలా ఉంటందని చూసుకుంటే .. దారుణంగా ఉంటుందని అర్ధమైంది. అందుకే వెంటనే డెసిషన్ తీసుకుని.. పిటిషన్ విత్ డ్రా చేయించేశారు.