టీటీడీ చైర్మన్ గా మరోసారి ప్రమాణం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఈవో జవహర్ రెడ్డి ఆయన చేత ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణం చేయడం ఇది రెండోసారి. మొదటిసారి 2019 జూన్ 21న ఆయన్ను నియమించింది ప్రభుత్వం. అయితే పదవీకాలం ముగియడంతో… మళ్లీ వైవీనే చైర్మన్ గా నియమిస్తూ ఈనెల 8న ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. ఈ నేపథ్యంలోనే ఆయన చైర్మన్ గా ప్రమాణం చేశారు. త్వరలోనే బోర్డు సభ్యుల నియామకం కూడా ఉంటుంది.