కరోనా కారణంగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే జరపనున్నట్లు తెలిపారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వచ్చే నెల 7 నుంచి 15 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే థర్డ్ వేవ్ హెచ్చరికలు.. కేంద్ర మార్గదర్శకాల నేపథ్యంలో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు సుబ్బారెడ్డి.
ఇక సర్వదర్శనం టోకెన్ల ఆలస్యంపైనా క్లారిటీ ఇచ్చారు టీటీడీ చైర్మన్. సాంకేతిక సమస్యల వల్లే ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించే ప్రక్రియ ఆలస్యమవుతోందని వివరించారు. వారం రోజుల్లో అన్నీ చక్కబడతాయని తెలిపారు.