టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ దర్శనాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ఆ దర్శనం టికెట్లు ఉన్నవారు వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకునే విధంగా రీషెడ్యూలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
కాగా మంగళవారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో తిరుమల ఘాట్ రోడ్డు లో నాలుగు చోట్ల రోడ్డు పాడయింది. ప్రస్తుతం ఈ రోడ్డును మరమ్మతులు చేయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి ఐఐటి నిపుణులను ఈ రహదారి రిపేర్ కోసం తీసుకొస్తున్నామని సుబ్బారెడ్డి అన్నారు. గడిచిన 20 ఏళ్ళల్లో ఎప్పుడు కురవని విధంగా ఈసారి వర్షాలు కురిశాయని అన్నారు సుబ్బారెడ్డి.