విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు భద్రతను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయనకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పిస్తున్నట్టు పేర్కొంది.
సిన్హాకు జడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించాలని సీఆర్ పీఎఫ్ అధికారులకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనకు కమాండోలతో భద్రత కల్పించనున్నారు.
ఆయన భద్రత కోసం సుమారు ఎనిమిది నుంచి పది మంది కమాండోలు పని చేయనున్నారు. సిన్హా ఎటు వెళ్లినా ఆయన వెంట వారు ఎస్కార్ట్ గా వెళ్లనున్నారు.
రాష్ట్రపతి పదవికి ఆయన ఈ నెల 27న నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారు. ఆమె నేడు నామినేషన్ వేయనున్నారు.