ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును కూటమి నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమెకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆమెను ప్రకటించిన వెంటనే ఈ మేరకు కేంద్ర హోం శాఖ నుంచి సీఆర్పీఎఫ్ కు ఆదేశాలు వెళ్లాయి. ఆమెకు వీఐపీ భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
ఇక నుంచి ఆమె భద్రతను 14 నుంచి 16 మంది పారామిలటరీ సిబ్బంది చూసుకోనున్నారు. ఆమె ఏ పర్యటనలో ఉన్న ఆ సిబ్బంది ఎస్కార్ట్ గా వెళ్లనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమె ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు బీజేపీ శ్రేణులు ప్రకటించనున్నాయి. ఇక విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఈ నెల 27న నామినేషన్ వేయనున్నారు.