తెలంగాణలో తొలిసారి కరోనా మరణాలకు బ్రేక్ పడింది. రెండో దశ మొదలైన తర్వాత మొదటిసారి రాష్ట్రంలో రోజువారీ మరణాలు సున్నాగా నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 170 కొత్తకేసులు వెలుగుచూడగా.. ఒక్క మరణం కూడా సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,612 గా ఉంది.
మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు 6.65 లక్షలకు మంది కరోనా సోకింది. మరణాల సంఖ్య 3,912 గా నమోదైంది. ఆదివారం మొత్తం 259 మంది రోగులు కోలుకోగా.. మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 6.56 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు (CFR) 0.58% గా ఉండగా, రికవరీ రేటు 98.71% గా ఉన్నట్టు వైద్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 2.61 కోట్ల కరోనా పరీక్షలు చేశారు. దీంతో ప్రతి మిలియన్ జనాభాకు 7.03 లక్షల మందిని పరీక్షించినట్టు అయింది.